Skip to main content

హరేకృష్ణ హరేకృష్ణ క్రిష్ణక్రిష్ణ హరేహరే| హరేరామ హరేరామ రామరామ హరేహర

హరేకృష్ణ హరేకృష్ణ క్రిష్ణక్రిష్ణ హరేహరే| 
హరేరామ హరేరామ రామరామ హరేహరే||

పదహారు నామములతో కూడిన ఈ మహామంత్రము సర్వోత్కృష్టమైనది.  ఈ నామజపము వలన సర్వ సిద్ధులు లభించును.

ఎవని నాలుకపై అహర్నిశము హరినామము తాండవము చేయునో వానికి కురుక్షేత్రము, కాశి, పుష్కర క్షేత్రము మొదలుగు తీర్ధ పర్యటనల అవసరమేమి? (స్కాంద పురాణము)

సహస్ర కోటి తీర్థ యాత్రలు చేసినంతటి ఫలితమును అతి శీఘ్రముగ నిరంతర నామ సంకీర్తన వలన పొందగలము (వామన పురాణము)

ఒకానొకప్పుడు కురుక్షేత్రములో విశ్వామిత్రుడు తన భక్త సమూహమునకు ఇట్లు చెప్పెను.
"ఈ భూమండలము నందు గల అనేక తీర్థములను గురించి వింటిని.  కాని హరి నామము యొక్క కోటి అంశముతోనైనను అవి ఏవియు సమము కానేరవు.  నామము అంతటి విలువైనది". (విశ్వామిత్ర సంహిత)

వేద, ఆగమ, శాస్త్రాదుల పఠనము వలనను, అనేక తీర్థ పర్యటనల వలనను ఏమి ప్రయోజనము? ఒకవేళ నీకు ముక్తి కావలయునని నచో గోవిందా! యని అనుక్షణము స్పష్టముగా కీర్తించుము. (లఘు భాగవతము)

సూర్యగ్రహణ కాలమందు కోటి గోవులను దానము చేసినను, మాఘ మాస వ్రత నియమానుసారము ప్రయాగ లో గంగానదీ తీరమందు కల్పము వరకు నివాసము చేసినను, అసంఖ్యాకములైన యజ్ఞములు చేసినను, మేరు పర్వత సమానమగు సువర్ణ దానము చేసినను, గోవింద కీర్తనములో నూరవ అంశమునకు అవి అన్నియును సమము కానేరవు. (లఘు భాగవతము)

చెరువులు, నూతులు, తోటలు నిర్మించుట, మొదలగునవి పుణ్య కర్మలైనను బంధన హేతువులే అగుచున్నవి.  శ్రీహరి నామ సంకీర్తనమొక్కటే శ్రీహరి పాదారవిందముల యొద్దకు మనలను చేర్చగలదు.  (బోధాయన సంహిత)

రాజేంద్రా! సాంఖ్య, యోగ శాస్త్రములతో నీకు పని ఏమున్నది? నీకు ముక్తి కావలయునేని గోవిందనామ కీర్తనము చేయుము (గరుడ పురాణము)

Comments

Popular posts from this blog

నేటి బంధాల్లో బలమెంత?

ప్రపoచంలో ఆడదే కరువైనట్టు ఏరి కోరి చేసుకున్నాను ఈవిడ గారిని ఇది భార్య కాదు ...బ్రహ్మ రాక్షసి. - ఓ భర్త ఆవేదన. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో వీడికి భార్యనయ్యాను.  ఓ ముద్దా......

ముఖ సౌందర్యము

( మొటిమలు , మచ్చలు , కమిలి పోవడం , గరుకు )      ముఖ సౌందర్యం అంటే నిజానికి ముఖము ఎల్లప్పుడూ ప్రకాశవంతముగా , Fresh గా పరి పూర్ణంగా ఉండడం . మీరు సంపూర్ణ ఆరోగ్యంగా వున్న యెడల , ఒక తేజస్...

శ్రీ రాజీవ భాయి సమాధానాలు

మాంసాహార విక్రేతలు చాలా పేరు ప్రతిష్టలున్న న్యాయవాదులను  ఈ కేసులో పెట్టుకున్నారు.  వారిలో కొంతమంది న్యాయవాదులు 35 లక్షల ఫీజు తీసుకునేవారున్నారు. మాంసాహారుల తరఫున ...